జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ
మొదటి భాగం తరువాత………….
–
అభివృద్ధి పేరుతో…
ఈ వాదనతో ఉన్న రెండో సమస్య ఏమిటంటే, ధరలపై కేంద్రీకరించడం ద్వారా మరింత మౌలికమయిన రాజకీయ సమస్యను విస్మరించింది. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం రైతుల నుండి భూములను బలవంతంగా గుంజుకుని ప్రైవేటు కంపెనీలకు ఎందుకు ఇవ్వాలి? కనీసం ఆంగ్లంలో అనుబంధాలు ఇచ్చినప్పటి నుండి… భూములను ఒక గ్రూపు ప్రజల నుండి తీసేసుకుని మరో గ్రూపుకు (సాధారణంగా సంపన్నులు) ఇవ్వడాన్ని “ప్రజా” లేదా “జాతీయ” లక్ష్యాన్ని నెరవేర్చడంగా ప్రభుత్వాలు సమర్ధించుకున్నాయి. గత శతాబ్దంలో ఈ కార్యాన్ని సాధారణంగా అభివృద్ధి పేరుతో నిర్వహించారు. ఆర్ధికవేత్తలలో అత్యధికులు ఏమంటారంటే భూములను వ్యవసాయం కంటే “అధిక విలువ”తో కూడిన వినియోగంలోకి తెస్తే గనుక అది అభివృద్ధి అవుతుందని; ఆ కారణం చేత అది “ప్రజా లక్ష్యం” నెరవేర్చడం అవుతుందని భావిస్తారు. కానీ అభివృద్ధిలో ఏమేమి ఇమిడి ఉంటాయి, ఆ అభివృద్ధి రైతులను వారి భూముల నుండి వెళ్లగొట్టేటంతటి “ప్రజా లక్ష్యం”తో కూడుకుని ఉన్నదా అన్నది సాంకేతిక సమస్య కాదు, కనీసం న్యాయపరమైన సమస్య కూడా కాదు, అది రాజకీయ సమస్య. అది చారిత్రక దృక్పధంతో పరిశీలించవలసిన రాజకీయ సమస్య.
స్వాతంత్రానంతర కాలంలో భారత రాజ్యం ప్రభుత్వరంగ ప్రాజెక్టుల కోసమే ఎక్కువగా భూములను స్వాధీనం చేసుకుంది. భూ స్వాధీన చట్టం (ఎల్.ఎ.ఎ) కింద ప్రైవేటు కంపెనీల కోసం భూములను స్వాధీనం చేసుకోవడమూ చట్టబద్ధమే. కానీ అప్పుడు ఉనికిలో ఉన్న అభివృద్ధి నమూనా…
అసలు టపాను చూడండి 506 more words
our people need more awareness to protect our democracy and our rights.ever politician should be questioned by the people.that is the correct pencillin medicine to all types of illnesses